సోమవారం 01 జూన్ 2020
International - May 22, 2020 , 16:29:56

రష్యాలో తగ్గని కరోనా తీవ్రత..కొత్తగా 150 మందికి పైగా మృతి

రష్యాలో తగ్గని కరోనా తీవ్రత..కొత్తగా  150 మందికి పైగా మృతి

మాస్కో:  రష్యాలో  గడచిన 24 గంటల్లో కొత్తగా 8,894 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వరుసగా మూడో రోజూ కొత్తగా  వైరస్‌ సోకిన వారి సంఖ్య 9,000 కన్నా తక్కువకు పడిపోయినప్పటికీ, శుక్రవారం అత్యధికంగా రోజువారీ కరోనా   మరణాల సంఖ్య 150గా నమోదైందని  వెల్లడించింది. 

24 గంటల్లో 150 మందికి పైగా మృతిచెందడంతో మొత్తం మరణాల సంఖ్య 3,249కు పెరిగింది. ఒక రోజు వ్యవధిలో 7,144 మంది కరోనా  నుంచి కోలుకున్నారు. రష్యాలో ఇప్పటి వరకూ 326,448 మందికి కరోనా సోకింది. అమెరికా తర్వాత రష్యాలో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. logo