గురువారం 16 జూలై 2020
International - Jun 14, 2020 , 19:02:23

రష్యాలో కరోనా విలయతాండ‌వం

రష్యాలో కరోనా విలయతాండ‌వం

మాస్కో: కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను కలవరపెడుతూనే ఉంది. చాలా దేశాల్లో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. రష్యాలో ఆదివారం ఒక్కరోజే కొత్తగా 8,835 మందికి పాజిటివ్‌గా తేలింది. గడచిన 24 గంటల్లో మరో 119 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,28,964కు చేరింది. ఇప్పటి వరకూ ఆదేశంలో 6,948 మంది కరోనా బారినపడి మరణించారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో రష్యా మూడో స్థానంలో ఉన్నది. 


logo