ఆదివారం 31 మే 2020
International - Apr 18, 2020 , 14:27:35

రష్యాలో ఒక్క రోజే 4,785 పాజిటివ్‌ కేసులు

రష్యాలో ఒక్క రోజే 4,785 పాజిటివ్‌ కేసులు

మాస్కో: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు రష్యా అతలాకుతలమవుతోంది.  ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి.  శనివారం ఒక్కరోజే 4,785 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో కొవిడ్‌-19 కేసుల సంఖ్య 36,792కి పెరిగింది. ఇప్పటి వరకు మొత్తం 313 మంది చనిపోయారు. 

శుక్రవారం ఒక్క రోజే 4,070 మందికి కరోనా నిర్ధారణ కాగా 41 మంది మరణించారు. మాస్కోలో 500 పడకలతో కరోనా ఆస్పత్రిని నిర్మించేందుకు రష్యా ఏర్పాట్లు చేస్తోంది. కరోనా కట్టడికి ఆ దేశాధ్యక్షుడు  వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇప్పటికే  లాక్‌డౌన్‌ను మే 1 వరకు పొడిగించారు. కరోనా రోగులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వాడేందుకు కూడా అనుమతించారు. 


logo