శనివారం 30 మే 2020
International - May 16, 2020 , 13:38:15

రష్యాలో కరోనా కేసులు @2,72,043

రష్యాలో కరోనా కేసులు @2,72,043

మాస్కో: రష్యాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అగ్రరాజ్యం అమెరికా తర్వాత రష్యాలోనే కరోనా బాధితులు ఎక్కువగా ఉన్నారు.  శనివారం కొత్తగా 9,200 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,72,043కు పెరిగింది. మాస్కో  న‌గ‌రం క‌రోనా వ్యాప్తికి కేంద్ర‌ బిందువుగా మారింది. మొత్తం కేసుల్లో సగానికిపైగా మాస్కోలోనే ఉన్నాయి.  గడచిన 24 గంటల్లో మరో 119 మంది చనిపోయారు.  శనివారం వరకు రష్యాలో 2,537 మంది మరణించారు. 60శాతానికి పైగా కరోనా మరణాలు మాస్కోలోనే సంభవించాయి.  


logo