బుధవారం 03 జూన్ 2020
International - May 20, 2020 , 14:28:59

రష్యాలో విలయం..3లక్షలు దాటిన కరోనా కేసులు

రష్యాలో విలయం..3లక్షలు దాటిన కరోనా కేసులు

మాస్కో: రష్యాలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. ఆ దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య  3లక్షల మార్క్‌ దాటింది. బుధవారం కొత్తగా 8,764   మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 308,705కు పెరిగింది. మే 2 తర్వాత ఒకరోజు వ్యవధిలో తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. 

గడచిన 24 గంటల్లో మరో 135 మంది చనిపోవడంతో కరోనా వల్ల ఇప్పటివరకూ 2,972 మంది ప్రాణాలు కోల్పోయారు.  ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన అమెరికా తర్వాత రష్యానే రెండో స్థానంలో ఉంది. ఇటీవల కరోనా బారిన పడిన రష్యా ప్రధాని మైకేల్‌ మిషుస్తిన్‌ పూర్తిగా కోలుకున్నారు. 


logo