బుధవారం 08 జూలై 2020
International - Jun 27, 2020 , 14:30:54

రష్యాలో తగ్గుతున్న కరోనా కేసుల సంఖ్య

రష్యాలో   తగ్గుతున్న కరోనా కేసుల సంఖ్య

మాస్కో: ప్రపంచంలోనే అతిపెద్ద దేశం రష్యాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి.  వరుసగా రెండోరోజూ 7వేల కన్నా తక్కువగానే కొత్త కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌ తర్వాత రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం ఇదే తొలిసారి. 

రష్యాలో శనివారం మరో 6,852 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 6,27,646కు చేరింది. గడచిన 24 గంటల్లో కరోనాతో మరో 188 మంది చనిపోవడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 8,969కు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా  కరోనా బాధితుల సంఖ్య  ఎక్కువగా ఉన్న   దేశాల్లో రష్యా మూడో స్థానంలో ఉంది. 


logo