మంగళవారం 26 మే 2020
International - Apr 20, 2020 , 18:14:50

రష్యాలో తగ్గని తీవ్రత..కొత్తగా 4,268 కరోనా కేసులు

రష్యాలో తగ్గని తీవ్రత..కొత్తగా 4,268 కరోనా కేసులు

మాస్కో: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు రష్యా అతలాకుతలమవుతోంది.  'కొవిడ్‌-19' ప్ర‌భావం తీవ్రంగానే ఉండటంతో  ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్తగా కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. సోమవారం మరో 4,268 మందికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు రష్యాలో కరోనా సోకిన వారి సంఖ్య 47,121కు పెరిగింది. ఇప్పటి కరోనా బారినపడి 405 మంది మృతిచెందారు. ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో అత్యధికంగా 6,060 పాజిటివ్‌ కేసులు నమోదైన విషయం తెలిసిందే.  ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 160,000 దాటింది. 


logo