శనివారం 06 జూన్ 2020
International - May 10, 2020 , 16:10:32

ఒకేరోజు 11వేల కరోనా కేసులు..2లక్షలు దాటిన బాధితులు

ఒకేరోజు 11వేల కరోనా కేసులు..2లక్షలు దాటిన బాధితులు

మాస్కో: ప్రపంచంలోనే అతిపెద్ద దేశం రష్యాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2లక్షలు దాటింది.  వరుసగా ఎనిమిదో రోజూ పదివేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 11,012 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా..88 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 209,688కు పెరిగింది. ఇప్పటివరకూ కరోనా వల్ల 1,915 మంది మరణించారు. కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నప్పటికీ మరణాల రేటు తక్కువగా ఉండటం గమనార్హం. logo