శనివారం 06 జూన్ 2020
International - May 04, 2020 , 14:49:45

ర‌ష్యాలో క‌రోనా క‌ల్లోలం..ఒక్క రోజే 10,581 కేసులు

ర‌ష్యాలో క‌రోనా క‌ల్లోలం..ఒక్క రోజే 10,581 కేసులు

మాస్కో:  ప్రపంచంలోనే అతి పెద్ద దేశం రష్యాలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది.    వరుసగా పదివేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవడం ఇది రెండోసారి.  గడచిన 24 గంటల్లో కొత్తగా 10,581 మందికి కరోనా సోకగా..76 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 145,268కు పెరిగింది. ఇప్పటి వరకూ కరోనా వల్ల  1,356 ప్రాణాలు కోల్పోయారు. 

చైనా, టర్కీ, ఇరాన్‌ దేశాల తర్వాత అత్యధిక కరోనా బాధితులున్న దేశం రష్యానే. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో రష్యాది ఏడోస్థానం. రోజురోజుకు బాధితుల సంఖ్య వేలల్లో పెరుగుతుండటంతో దేశప్రజలు ఆందోళన చెందుతున్నారు.  రాజధాని మాస్కోలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి.


logo