గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Jul 23, 2020 , 15:50:42

ర‌ష్యాలో కొత్త‌గా 5,848 క‌రోనా కేసులు

ర‌ష్యాలో కొత్త‌గా 5,848 క‌రోనా కేసులు

మాస్కో : ర‌ష్యాలో క‌రోనా మ‌హ‌మ్మారి కాస్త తగ్గుముఖం ప‌డుతున్న‌ది. రెండు రోజుల్లో కేవ‌లం ఐదువేల‌లోపే కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. కాగా, గ‌డిచిన 24గంట‌ల్లో 5,848 కేసులు న‌మోద‌య్యాయ‌ని ఆ దేశ క‌రోనా వైర‌స్ ప్ర‌తి స్పంద‌న కేంద్రం తెలిపింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 83 ప్రాంతాల్లో 5,848 కొవిడ్‌-19 కేసుల‌ను నిర్ధారించింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశవ్యాప్తంగా 7,95,038 కేసులు నిర్ధార‌ణ కాగా, రోజు వారీ పెరుగుద‌ల 0.7 శాతంగా ఉంద‌ని వైర‌స్ రెస్పాన్స్ తెలిపింది. మాస్కోలో కేవ‌లం 608 కేసులు నమోదయ్యాయి. వైర‌స్ ప్ర‌భావంతో ఇప్ప‌టి వ‌ర‌కు 12,892 మంది మృతి చెందారు. 5,80,330 మంది క‌రోనా నుంచి కొలుకొని డిశ్చార్జి కాగా, మ‌రో 2.67ల‌క్ష‌ల మంది చికిత్స పొందుతున్నారు. logo