మంగళవారం 19 జనవరి 2021
International - Dec 26, 2020 , 17:39:14

ర‌ష్యాలో త‌గ్గ‌ని క‌రోనా విస్తృతి

ర‌ష్యాలో త‌గ్గ‌ని క‌రోనా విస్తృతి

మాస్కో: ర‌ష్యాలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. రోజుకు 25 వేల‌కుపైగా కొత్త కేసులు న‌మోదవుతున్నాయి. ఇవాళ కూడా కొత్తగా 29,258 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దాంతో ర‌ష్యాలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30 ల‌క్ష‌ల మార్కును దాటి 30,21,964కు చేరింది. కొత్త‌గా న‌మోదైన మొత్తం కేసుల‌లో రాజ‌ధాని మాస్కోలోనే 7,480 మందికి పాజిటివ్ వ‌చ్చింది. 

ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా ర‌ష్యాలో భారీగానే పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 567 మందికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఆ దేశంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 54,226కు చేరింది. గ‌త 24 గంట‌ల్లో 28,185 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి కావ‌డంతో మొత్తం రిక‌వ‌రీల సంఖ్య 24,26,439కి పెరిగింది.     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.