శుక్రవారం 05 జూన్ 2020
International - May 08, 2020 , 14:47:30

ఒక్కరోజే 10,699 కేసులు..ప్రపంచంలో ఐదో స్థానానికి..

ఒక్కరోజే 10,699 కేసులు..ప్రపంచంలో ఐదో స్థానానికి..

మాస్కో: ప్రతిరోజు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటంతో రష్యా విలవిల్లాడుతోంది. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 10,699 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వరుసగా ఆరోరోజు పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి.  దీంతో దేశవ్యాప్తంగా మొత్తం బాధితుల సంఖ్య 187,859కు పెరిగింది. కేసులు, మరణాల్లో సగానికి పైగా దేశరాజధాని మాస్కోలోనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 98 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 1,723కు పెరిగింది. 

కరోనా తీవ్రత అధికంగా ఉన్న మాస్కోలో లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించినట్లు మేయర్‌ సెర్గీ సోబ్యానిన్‌ ప్రకటించారు. అమెరికా తర్వాత అత్యంత వేగంగా వైరస్‌ సోకుతున్న వారి సంఖ్య రష్యాలోనే అధికంగా ఉంది. కరోనా బాధితుల  పరంగా ప్రపంచంలో ఐదో స్థానానికి రష్యా చేరింది. గురువారమే జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాలను దాటేసింది.  


logo