సోమవారం 01 జూన్ 2020
International - May 05, 2020 , 14:04:49

రష్యాలో విజృంభిస్తున్న వైరస్‌..10వేలు దాటిన కరోనా కేసులు

రష్యాలో విజృంభిస్తున్న వైరస్‌..10వేలు దాటిన కరోనా కేసులు

మాస్కో: ప్రపంచంలోనే అతి పెద్ద దేశం రష్యాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.  ఆ దేశంలో వరుసగా మూడోరోజు 10వేలకు పైగా కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. అందులో అత్యధిక కేసులు దేశరాజధాని మాస్కోలోనివే. గడచిన 24 గంటల్లో  కొత్తగా 10,102 మందికి వైరస్‌ సోకిందని ఆరోగ్యశాఖ అధికారులు మంగళవారం తెలిపారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య  155,370కు పెరిగింది. ఒక రోజు వ్యవధిలో 95 మంది చనిపోవడంతో మొత్తం  మరణాల సంఖ్య 1,451కు చేరింది. ఇప్పటి వరకు వ్యాధి నుంచి 19,865 మంది కోలుకున్నారు. ఇంకో 2,300 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.  


logo