శనివారం 30 మే 2020
International - May 02, 2020 , 15:28:03

రష్యాలో ఒక్కరోజే 9,623 కేసులు

రష్యాలో ఒక్కరోజే 9,623 కేసులు

మాస్కో: రష్యాలో కరోనా వైరస్‌ ఉద్ధృతి పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే కొత్తగా 9,623 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  కరోనా తొలి కేసు నమోదైన తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం  దేశంలో  ఇదే తొలిసారని కరోనా వైరస్‌  రెస్పాన్స్‌ సెంటర్‌ తెలిపింది.   దీంతో మొత్తం బాధితుల సంఖ్య 124,054కు చేరింది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,793 మంది పేషెంట్లు కోలుకోని డిశ్చార్జ్‌ అయ్యారు.

ఇప్పటి వరకు 15,013 మంది కరోనా రోగులు డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా బారినపడి 1,222 మంది ప్రాణాలు కోల్పోయారు.  శనివారం వరకు రష్యాలో సుమారు 40లక్షల మందికి కరోనా టెస్టులు చేశారు. 


logo