శనివారం 04 జూలై 2020
International - Jun 02, 2020 , 13:58:00

రష్యాలో కరోనా విలయం..భారీగా పెరుగుతున్న మరణాలు

రష్యాలో కరోనా విలయం..భారీగా పెరుగుతున్న మరణాలు

మాస్కో: కరోనా మహమ్మారి రష్యాను అతలాకుతలం చేస్తున్నది. ఆ దేశంలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య  పెరిగిపోతూనే ఉంది. కరోనా బాధిత దేశాల్లో మూడో స్థానంలో ఉన్న రష్యాలో మరణాలు ఐదు వేలు,  కేసుల సంఖ్య 4 లక్షలు దాటింది.

గడచిన 24 గంటల్లో కొత్తగా  8,863 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 423,741కు చేరింది. ఒక రోజు వ్యవధిలో 182 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 5,037కు పెరిగింది. 


logo