సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Sep 05, 2020 , 16:38:31

రష్యాలో కొత్తగా 5,205 కరోనా పాజిటివ్‌ కేసులు..

రష్యాలో కొత్తగా 5,205 కరోనా పాజిటివ్‌ కేసులు..

మాస్కో: గత 24 గంటల్లో రష్యాలో 5,205 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 10,20,310కి చేరుకుంది. ‘గత 24 గంటల్లో 84 ప్రాంతాల్లో 5,205 కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,249 (24 శాతం) మందికి లక్షణాలు కనిపించలేదు.’ అని ఆ దేశ కొవిడ్‌ రెస్పాన్స్‌ సెంటర్‌ ప్రకటించింది. 

మాస్కోలో 671 కేసులు, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 195, మాస్కో ప్రాంతంలో 168 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 110 మరణాలు సంభవించాయి. దీంతో మరణాల సంఖ్య మొత్తం 17,759కి చేరుకుంది. 5,379 మంది కొవిడ్‌నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. కొవిడ్‌ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 8,38,126గా ఉంది. ఇదిలా ఉండగా, రష్యా రిజిస్టర్‌ చేసిన కొవిడ్‌ టీకా సురక్షితమని ప్రముఖ వైద్య పత్రిక లాన్సెట్‌  చెప్పడంతో ఆ దేశ ప్రజలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo