గురువారం 01 అక్టోబర్ 2020
International - Sep 06, 2020 , 19:41:36

రష్యాలో 10 లక్షలు దాటిన కరోనా కేసులు

రష్యాలో 10 లక్షలు దాటిన కరోనా కేసులు

మాస్కో :  రష్యాలో కరోనా వైరస్‌ మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో  ఆ దేశంలో కొత్తగా 5,195 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వైరస్‌ బారినపడిన వారిలో 2,823 మంది కోలుకున్నారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 61 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రష్యాలో 10 లక్షల 25 వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆ దేశ కరోనా ప్రతిస్పందనా కేంద్రం ఆదివారం తెలిపింది. గత 24 గంటల్లో 84 ప్రాంతాల్లో 5,195 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వీరిలో 1,156 (22.2 శాతం) మందికి ఎలాంటి లక్షణాలు కనిపించలేదని పేర్కొంది. మాస్కోలో 620 కేసులు, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 192 కేసులు, మాస్కోలో 167 కేసులు నమోదయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo