బుధవారం 03 జూన్ 2020
International - Apr 03, 2020 , 20:03:12

రష్యాలో సరికొత్త సాంకేతికతతో కరోనా కట్టడి

రష్యాలో సరికొత్త సాంకేతికతతో కరోనా కట్టడి

హైదరాబాద్:  రష్యాలో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు సరికొత్త సాంకేతికతను ఉపయోగిస్తున్నది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఫేషియల్ రికగ్నైజేషన్‌ ద్వారా ఈ మహమ్మారిని నిరోధించి పనిలో పడింది ఆ దేశం. ఆధునిక టెక్నాలజీని కరోనాపై యుద్ధం చేస్తున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్. వైరస్ అన్ని దేశాల్లో విశ్వరూపం చూపిస్తున్నసమయంలో రష్యా కరోనా పేషెంట్లు, అనుమానితుల కదలికలపై ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్‌తో నిఘా పెట్టింది. 600మందిని ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా అటువంటి రోగులను వెతుకుతున్నారు. 1,70,000 కెమెరాలున్న ఈ ఫేషియల్ రికగ్నజైషన్ ద్వారా నే ఇటీవల 200మంది క్వారంటైన్‌ ఐసోలేషన్‌ నిబంధనలను పాటించలేదని తెలుసుకున్నారు.

అర నిమిషం బయట తిరిగినా వెంటనే కనుక్కోవడం ఈ ఫేషియల్ రికగ్నైజేషన్‌తో రష్యాకి సాధ్యపడింది. దీంతో మరో 9వేల కెమెరాలను మాస్కో వీధుల్లో అమర్చేందుకు అధికారులు తయారవుతున్నారు. కరోనా వైరస్ బాధితులు అనుమానితులుగా భావించేవారి సోషల్ నెట్‌వర్క్‌లను కనుక్కోవడం కూడా ఈ టెక్నాలజీతో సాధ్యపడుతున్నది. బీజింగ్ నుంచి మాస్కోకి వచ్చిన చైనా మహిళను ఈ టెక్నాలజీ తోనే తెలుసుకున్నారు. అంతేకాకుండా ఎయిర్ పోర్ట్ నుంచి తీసుకువచ్చిన టాక్సీ డ్రైవర్ ను ,అపార్ట్ మెంట్లో క్వారంటైన్‌ని అతిక్రమించిన మరో మహిళ తో సహా మొత్తం 600మందిని ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారానే వారి జాడ తెలుసుకోగాలిగారు.


logo