ఆదివారం 05 జూలై 2020
International - Jun 01, 2020 , 14:37:37

రష్యాలో కొత్తగా 9,035 పాజిటివ్‌ కేసులు

రష్యాలో కొత్తగా 9,035 పాజిటివ్‌ కేసులు

మాస్కో: కరోనా మహమ్మారి రష్యాను వణికిస్తోంది. ఆ దేశంలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. కరోనా బాధిత దేశాల్లో మూడో స్థానంలో ఉన్న రష్యాలో కేసుల సంఖ్య ఇప్పటికే నాలుగు లక్షలు దాటింది. సోమవారం కొత్తగా 9,035 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 414,878కు చేరింది. గడచిన 24 గంటల్లో 162 మంది చనిపోయారు. ఇప్పటి వరకు రష్యాలో కరోనా వల్ల 4,855 మంది మరణించారు. logo