బుధవారం 12 ఆగస్టు 2020
International - Jul 03, 2020 , 14:16:21

రష్యాలో తగ్గుముఖం పట్టిన కరోనా..!

రష్యాలో తగ్గుముఖం పట్టిన కరోనా..!

మాస్కో:   కరోనా కోరల్లో చిక్కి విలవిల్లాడిన   రష్యా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది.  నెలరోజుల పాటు  వైరస్‌ తీవ్రస్థాయిలో విజృంభించడంతో దేశంలో ఆరున్నర లక్షల మందికిపైగా కరోనా మహమ్మారి బారినపడ్డారు.  కొత్తగా వైరస్‌ సోకుతున్న వారి సంఖ్య క్రమంగా  తగ్గుతున్నది.   కొన్నిరోజుల నుంచి  7వేల కన్నా తక్కువగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి.  

రష్యాలో శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 6,718 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య  6,67,883కు చేరింది. గడచిన 24 గంటల్లో మరో 176 మంది మృతిచెందారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 9,859కు పెరిగింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo