శుక్రవారం 05 జూన్ 2020
International - May 15, 2020 , 16:29:46

రష్యాలో ఒక్కరోజే 10,598 పాజిటివ్‌ కేసులు

రష్యాలో ఒక్కరోజే  10,598 పాజిటివ్‌ కేసులు

మాస్కో: రష్యాలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 10,598 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 262,843కు చేరింది. గడచిన 24 గంటల్లో మరో 113 మంది కరోనా వల్ల చనిపోవడంతో ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య  2,418కు పెరిగింది. అమెరికా తర్వాత రష్యాలోనే కరోనా బాధితులు ఎక్కువగా ఉన్నారు. రష్యాలో గత 15 రోజుల నుంచి సగటున పదివేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు ఆ దేశంలో 60లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. దేశరాజధాని మాస్కోలోనే సగానికిపైగా బాధితులు ఉన్నారు. logo