మాస్కో: విమానాలు దింపడానికి సాధ్యం కాని చోట గాలింపు చర్యల కోసం రష్యాకు చెందిన టెక్నోడైనమిక అనే కంపెనీ కొత్త తరహా పారాచూట్లను తయారు చేసింది. వీటితో సైనికులు జాగిలాలను వెంట తీసుకొని విమానాల నుంచి కిందకి దిగవచ్చు. ఇంతకుముందు ఇలాంటి పారాచూట్లు రష్యాలో లేవని టెక్నోడైనమిక తెలిపింది. పారాచూట్లను పరీక్షించామని ఒక శునకానికి కూడా హాని కలుగలేదని పేర్కొన్నది.