బుధవారం 03 జూన్ 2020
International - Apr 24, 2020 , 14:59:18

రష్యాలో 24 గంటల్లో 5,849 కొత్త కేసులు

రష్యాలో 24 గంటల్లో 5,849 కొత్త కేసులు

మాస్కో: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు రష్యా అతలాకుతలమవుతోంది.  ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్తగా  కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి.  24 గంటల వ్యవధిలో రష్యాలో 5,849 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 68,622కు చేరగా..శుక్రవారం వరకు 615 మంది కరోనా బారినపడి చనిపోయారు. ఇప్పటి వరకు రష్యాలో  2.5మిలియన్ల మందికి కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు చేశారు. కరోనా కట్టడికి రష్యాలోనూ లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. 


logo