శనివారం 06 జూన్ 2020
International - May 12, 2020 , 15:11:56

వరుసగా పదోరోజూ పదివేలపైనే కరోనా కేసులు

వరుసగా పదోరోజూ పదివేలపైనే  కరోనా కేసులు

మాస్కో:  ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ రష్యాలో మాత్రం రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.  కరోనా మహమ్మారి రష్యాలో వేగంగా వ్యాప్తిచెందుతోంది. వరుసగా పదోరోజూ  పదివేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడచిన 24గంటల్లో  కొత్తగా 10,899  మందికి వైరస్‌ సోకింది. ఒక రోజు వ్యవధిలో 107 మంది మరణించారు.  తాజా పాజిటివ్ కేసుల్లో సగానికిపైగా మాస్కోలోనివే. 

మంగళవారం వరకు దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,32,243కు పెరిగింది. రష్యాలో కరోనా వల్ల  ఇప్పటి వరకూ 2,116 మంది చనిపోయారు. అమెరికా తర్వాత అత్యంత వేగంగా వైరస్‌ వ్యాప్తిస్తున్న రెండో దేశం రష్యానే. కరోనా బాధితుల సంఖ్య పరంగా జాబితాలో మూడోస్థానానికి చేరుకున్నది.


logo