శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Aug 24, 2020 , 09:10:48

మరో శుభవార్త చెప్పిన రష్యా..

మరో శుభవార్త చెప్పిన రష్యా..

మాస్కో : కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచం వణికిపోతోంది. వైరస్‌ నుంచి తీవ్రత రోజు రోజుకు కేసులు సంఖ్య పెరుగుతుండగా వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ విడుదల చేసిన రష్యా మరో శుభవార్తను చెప్పింది. వెక్టర్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయో టెక్నాలజీ తయారు చేసిన ఎపివాక్‌ వ్యాక్సిన్‌ మనుషులపై చేసిన ప్రయోగాల్లో సురక్షితంగానే ఉన్నట్లు ఓ నివేదికలో తెలిపింది. వచ్చే సెప్టెంబర్‌ నాటికి క్లినిక్‌ ట్రయల్స్‌ పూర్తవుతాయని ఫెడరల్ సర్వీస్ ఫర్ సర్వైవలెన్స్ ఆన్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్‌ సంస్థ ప్రకటించింది. వ్యాక్సిన్‌ మొదటి షాట్‌ 57 మందికి ఇవ్వగా ఎలాంటి దుష్ప్రభావాలు కలిగించలేదని చెప్పింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దేశం మొదటి వ్యాక్సిన్ స్పుత్నిక్ వీని ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్‌పై పలు విమర్శలు వెల్లువెత్తాయి. వ్యాక్సిన్‌ను సరిగ్గా పరిశీలించలేదని పలు ఆదేశాలు ఆరోపిస్తుండగా, మరికొన్ని దేశాలు తమకు పంపాలని రష్యాను కోరుతున్నాయి. అయితే వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ సైతం స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ గురించి తమకు సమాచారం లేదని పేర్కొన్న విషయం తెలిసిందే.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo