గురువారం 28 మే 2020
International - May 17, 2020 , 18:50:56

రష్యాలో 24 గంటల్లో కొత్తగా 9,709 పాజిటివ్‌ కేసులు

రష్యాలో 24 గంటల్లో కొత్తగా 9,709 పాజిటివ్‌ కేసులు

మాస్కో:  కరోనా మహమ్మారి రష్యాలో ఉధ్దృతంగానే వ్యాపిస్తోంది. రాజధాని నగరం మాస్కోలో తీవ్రంగా విరుచుకుపడుతున్నది. ఒక్కరోజు వ్యవధిలో కొత్తగా 9,709 పాజిటివ్‌ కేసులు  నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 281,752కు చేరింది. గడచిన 24 గంటల్లో 94 మంది కరోనా వల్ల చనిపోయారు. దేశవ్యాప్తంగా ఆదివారం వరకు 2,631 ప్రాణాలు కోల్పోయారు. అమెరికా తర్వాత రష్యాలోనే అత్యంత వేగంగా ప్రజలు కరోనా బారినపడుతున్నారు. ఇప్పటి వరకు 60లక్షల మందికిపైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 


logo