మంగళవారం 07 జూలై 2020
International - Jun 26, 2020 , 14:03:40

రష్యాలో ఆగ‌ని కరోనా విజృంభణ

రష్యాలో ఆగ‌ని కరోనా విజృంభణ

మాస్కో: రష్యాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఆ దేశంలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్నది. కరోనా బాధిత దేశాల్లో మూడో స్థానంలో ఉన్న రష్యాలో  కొవిడ్‌-19 విజృంభణ ఏమాత్రం తగ్గడంలేదు. తాజాగా ఆ దేశంలో కొత్తగా 6,800 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రష్యాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 6,20,794కు చేరింది. గడచిన 24 గంటల్లో మరో 176 మంది చనిపోయారు. ఇప్పటి వరకూ  కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 8,781కు చేరింది. 


logo