బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Jul 19, 2020 , 16:32:16

రష్యాలో 24 గంటల్లో కొత్తగా 6,109 కరోనా కేసులు

రష్యాలో 24 గంటల్లో  కొత్తగా 6,109 కరోనా కేసులు

మాస్కో:    రష్యాలో  గడచిన 24 గంటల్లో   కొత్తగా 6,109 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,71,546కు చేరింది.   కొత్తగా  నమోదైన కేసుల్లో అత్యధికంగా రాజధాని మాస్కోలో  నమోదయ్యాయి.   ఆదివారం ఒక్కరోజే 95 మంది చనిపోయారు. కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య  12,342కు చేరింది. మిగతా దేశాలతో పోలిస్తే రష్యాలో కరోనా మరణాల రేటు తక్కువగా ఉన్నది. 

గడిచిన 24 గంటల్లో 3,481 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 5,50,344కు పెరిగింది.  కొత్తగా నమోదవుతున్న  కేసుల్లో  ఎక్కువ  మందిలో ఎటువంటి లక్షణాలు లేవని కరోనా రెస్పాన్స్ సెంటర్ చెబుతోంది.  అమెరికా, బ్రెజిల్‌, భారత్‌ తర్వాత రష్యాలోనే కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉన్నది. 


logo