సోమవారం 01 జూన్ 2020
International - May 11, 2020 , 13:44:15

రష్యాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

రష్యాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

మాస్కో: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రష్యాలో వేగంగా వ్యాప్తిచెందుతోంది. వరుసగా తొమ్మిదో రోజూ పదివేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారం  ఒక్క రోజే 11,656  మందికి వైరస్‌ సోకింది. తాజా కేసుల్లో సగానికిపైగా మాస్కోలోనివే. ఇప్పటి వరకూ ఆదేశంలో ఒక్కరోజులో అత్యధిక కేసులు నమోదవడం ఇదే తొలిసారి.  

రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 221,344కు చేరింది. ఇప్పటి వరకూ రష్యాలో  కరోనా వల్ల 2,009 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యాలో ఇప్పటి వరకు 56లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ప్రతిరోజు సగటున 188,000 టెస్టులు చేస్తున్నారు. రష్యాలో రెండో అతిపెద్ద సిటీ సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించారు. 


logo