బుధవారం 28 అక్టోబర్ 2020
International - Sep 30, 2020 , 21:22:00

రష్యా రెండో కొవిడ్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి

రష్యా రెండో కొవిడ్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి

మాస్కో: ప్రపంచంలోనే మొదటి కొవిడ్‌ టీకాను రిజిస్టర్‌ చేసిన రష్యా రెండో టీకాను కూడా నమోదు చేసేందుకు సమాయత్తమవుతున్నది. సైబీరియాకు చెందిన వెక్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ తయారుచేసిన రెండో కొవిడ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను ఇటీవల పూర్తిచేశారు. ఈ విషయాన్ని ఆర్‌ఐఏ వార్తా సంస్థ బుధవారం వెల్లడించింది. వెక్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫేస్‌ 2 క్లినికల్‌ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్లు పేర్కొంది.  

వెక్టర్ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసిన ఎపివాక్ కరోనాగా పిలుస్తున్న మరో వ్యాక్సిన్‌ను అక్టోబర్‌ 15 లోగా రిజిస్టర్‌ చేస్తామని నేషనల్‌ కన్జ్యూమర్‌ హెల్త్‌ వాచ్‌డాగ్ ఇటీవల ప్రకటించింది. కాగా, రష్యా మొదట రిజిస్టర్‌ చేసిన వ్యాక్సిన్‌ పేరు స్పుత్నిక్‌ వీ. దీన్ని ఆగస్టు 11న నమోదు చేసింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo