గురువారం 29 అక్టోబర్ 2020
International - Sep 19, 2020 , 15:01:59

కొవిడ్‌ చికిత్సకు మొట్టమొదటి ప్రిస్క్రిప్షన్‌ డ్రగ్‌ను ఆమోదించిన రష్యా!

కొవిడ్‌ చికిత్సకు మొట్టమొదటి ప్రిస్క్రిప్షన్‌ డ్రగ్‌ను ఆమోదించిన రష్యా!

మాస్కో: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రష్యా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో మొదటి కరోనా వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేసిన ఆ దేశం ఇప్పుడు ఫార్మసీలో అమ్మేందుకుగానూ మొట్టమొదటి ప్రిస్క్రిప్షన్‌ డ్రగ్‌ను ఆమోదించింది. ‘కరోనావిర్‌’గా పిలిచే ఈ ఔషధాన్ని రష్యాకు చెందిన ఆర్‌-ఫార్మ్‌ అభివృద్ధి చేసింది. దీనిని స్వల్ప, మధ్యస్థ లక్షణాలున్న కొవిడ్‌ రోగులకు చికిత్సలో భాగంగా అందించనున్నారు. ఈ యాంటీ వైరల్‌ డ్రగ్‌ను వారంలోగా దేశంలోని అన్ని ఫార్మసీలకు పంపిస్తామని ఆ కంపెనీ వెల్లడించింది. 168 మంది రోగులు పాల్గొన్న మూడోదశ క్లినికల్ ట్రయల్స్ తరువాత కరోనావిర్‌కు అనుమతి లభించిందని ఆర్-ఫార్మ్ తెలిపింది.

కరోనావిర్ ఆమోదం అవిఫావిర్‌ అనే డ్రగ్‌కు మార్గం సుగమమం చేసింది. ఈ రెండు ఔషధాలను జపాన్‌లో అభివృద్ధిచేసిన ఫావిపిరవిర్‌ డ్రగ్‌ ఆధారంగా తయారుచేశారు. ఇదిలా ఉండగా, కరోనావిర్‌ను ఆమోదించిన రష్యా కరోనా వైరస్‌ వ్యతిరేక పోరులో ప్రపంచంలోనే లీడ్‌ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇది ఇప్పటికే చాలా దేశాలకు కొవిడ్‌ -19 పరీక్షా కిట్‌లను ఎగుమతి చేస్తోంది. అలాగే, స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ సరఫరా కోసం అనేక అంతర్జాతీయ ఒప్పందాలను కుదుర్చుకుంది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo