భారత్‌లో స్పుత్నిక్ ఉత్పత్తికి రష్యా అంగీకారం..

హైదరాబాద్: కోవిడ్ కోసం స్పుత్నిక్ వీ టీకాను రష్యా సిద్ధం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ టీకాను భారత్‌లో కూడా ఉత్పత్తి చేసేందుకు రష్యా అంగీకారం తెలిపింది. భారత్‌కు చెందిన హెటిరో సంస్థ.. రష్యా ప్రభుత్వంతో కలిసి ఏడాదికి సుమారు 10 కోట్ల డోసులు తయారు చేసేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు. స్పుత్నిక్ వీ తన ట్విట్టర్ అకౌంట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. హెటిరో సంస్థతో పాటు రష్యన్ డైరక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్)లు ప్రపంచవ్యాప్తంగా టీకాను పంపిణీ చేయనున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఇండియాలో స్పుత్నిక్ వీ టీకా ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు రష్యా తన ప్రకటనలో పేర్కొన్నది. ఇండియాలో ప్రస్తుతం స్పుత్నిక్ టీకాకు చెందిన రెండవ, మూడవ దశ ట్రయల్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చిలోగా ట్రయల్స్‌ను పూర్తి చేయనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ పేర్కొన్నది.
తాజావార్తలు
- గుంటూరు జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- భార్యలతో గొడవపడి ఇద్దరు భర్తల ఆత్మహత్య
- పెంపుడుకుక్కకు అంత్యక్రియలు...!
- తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ‘అన్న’ కన్నుమూత
- బ్రిస్బేన్‌లో వర్షం.. ముగిసిన నాలుగో రోజు ఆట
- ట్రాక్టర్ల ర్యాలీపై ఢిల్లీ పోలీసులదే తుది నిర్ణయం..
- కంగనా యాక్షన్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..!
- కూకట్‌పల్లిలో దారుణం.. కుమారుడికి నిప్పంటించిన తండ్రి
- ఐపీఎల్లో కొత్తగా ఒక్క టీమే!
- నిర్మాత దొరస్వామి రాజు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం