ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Sep 03, 2020 , 15:15:10

ఎలుగుబంటి ఎదురొస్తే ఇలా తప్పించుకోవాలి..! వీడియో వైరల్‌

ఎలుగుబంటి ఎదురొస్తే ఇలా తప్పించుకోవాలి..! వీడియో వైరల్‌

కెనడా: మీరు రోడ్డుపై నడుచుకుంటూ పోతున్నారు. అకస్మాత్తుగా ఎలుగుబంటి ఎదురొచ్చిందనుకోండి.. అప్పుడు మీరేం చేస్తారు? ఏం చేయాలో అర్థంకావడం లేదా? కెనడాలో ఓ యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. కానీ ఆమె తన తెలివిని ఉపయోగించి దానినుంచి తప్పించుకున్నది. దీన్ని మరో రన్నర్‌ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టగా వైరల్‌ అవుతోంది.

కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోగల ప్రసిద్ధ కోక్విట్లామ్ క్రంచ్ ట్రయిల్‌లో ఉదయం 11 గంటలకు  ఓ యువతి రన్నింగ్‌ చేస్తోంది. పొదలమాటునుంచి ఒక్కసారిగా ఎలుగుబంటి రాగా, ఆమె కదలకుండా ఉండిపోయింది. అయితే, ఎలుగుబంటి యువతి దగ్గరికి వచ్చి తొడపై టచ్‌ చేసింది. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడడంతో అది వెనక్కి అడుగులు వేసింది. దీంతో సదరు యువతి అక్కడినుంచి పరుగుతీసింది. దీన్ని గమనిస్తున్న సామ్ అబ్దుల్లా అనే మరో రన్నర్ కెమెరాలో బంధించాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘భలే తప్పించుకుంది’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఆమె ధైర్యవంతురాలు అని కొనియాడుతున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo