బుధవారం 30 సెప్టెంబర్ 2020
International - Sep 07, 2020 , 15:10:31

దివ్యాంగుడి స్కేట్‌బోర్డింగ్‌.. చూస్తే ఆశ్చర్యపోతారు..!

దివ్యాంగుడి స్కేట్‌బోర్డింగ్‌.. చూస్తే ఆశ్చర్యపోతారు..!

రియోడిజనీరో: దివ్యాంగులకు సాధారణ పనులు చేసుకోవడమే కష్టం. కానీ కొందరు తీవ్రంగా శ్రమించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తుంటారు. అలాంటి కోవకు చెందినవాడే బ్రెజిల్‌కు చెందిన రువాన్‌ సిల్వా. ఈ 21 ఏళ్ల స్కేట్‌బోర్డర్ కళ్లు చెదిరే ఫీట్లతో ఆకట్టుకుంటున్నాడు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది. 

సిల్వా స్లైడ్‌లలో చాలా తేలికగా స్కేట్‌బోర్డింగ్ చేశాడు. అతడి ఫీట్‌ చూసినవారంతా ఆశ్చర్యపోయారు. గత రెండేళ్లుగా అతడి వీడియోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇటీవల తీసిన వీడియోను ఇన్‌స్టాలో పెట్టగా 10,000 కంటే ఎక్కువ మంది వీక్షించారు. సిల్వా స్కేట్‌బోర్డింగ్‌ తమలో స్ఫూర్తిని నింపిందని కామెంట్‌ చేశారు. మరెందుకాలస్యం ఆ వీడియోను మీరూ చూసేయండి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo