శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Mar 14, 2020 , 01:49:40

క్వారంటైన్‌లో రొమేనియా ప్రధాని

క్వారంటైన్‌లో రొమేనియా ప్రధాని

బుకారెస్ట్‌: రొమేనియా ప్రధాని లుడోవిక్‌ ఒర్బాన్‌ క్వారంటైన్‌ (స్వీయ దిగ్బంధం)లో ఉన్నారు. ఆయన అధ్యక్షతన సోమవారం జరిగిన ఓ భేటీలో పాల్గొన్న ఓ సెనేటర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ప్రధాని లుడోవిక్‌తోపాటు ఆ సమావేశంలో పాల్గొన్న చాలా మంది మంత్రులు, సభ్యులు ఐసొలేషన్‌లో ఉన్నారు. రొమేనియాలో ఇప్పటి వరకు 70 కరోనా కేసులు నమోదయ్యాయి. 


logo