శనివారం 04 జూలై 2020
International - Jun 01, 2020 , 12:15:20

ఈ షూ వేసుకుంటే సామాజిక దూరం పాటించినట్లే!

ఈ షూ వేసుకుంటే సామాజిక దూరం పాటించినట్లే!

కరోనా బారిన పడకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటించమని అధికారులు, పోలీసులు, వైద్యులు నిరంతరం చెబుతూనే ఉన్నారు. ఈ విషయంలో ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందుకే మనుషులు పాటించక పోయినా వారు వేసుకున్న షూ పాటించేలా చేస్తాయి అంటున్నారు రొమానియన్‌కు చెందిన 75 ఏండ్ల గ్రిగోర్ లప్. 

ఇతను చిన్నతనం నుంచి షూ తయారు చేసి కంట్రీ అంతటా ఎగుమతి చేస్తుంటాడు. లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో ప్రజలు షాపులు వద్ద సామాజిక దూరం పాటించడం లేదని గమనించాడు. బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న వారికి షూతో రక్షణ ఇవ్వాలనుకున్నాడు. ఒకటిన్నర మీటరు దూరంతో షూ ముక్కు భాగం తయారు చేస్తున్నాడు. ఈ షూ ధరిస్తే ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటించాల్సిందే. దీని సైజు 75. ఈ షూలను ఇంతకుముందు సినిమాల్లో ఎక్కువగా వాడేవారు. ఇప్పుడు అందరికీ ఉపయోగపడనున్నాయి. వీటి ధర రూ. 8659 వరకు ఉంటుందని చెప్పుకొచ్చాడు గ్రిగోర్‌.logo