బుధవారం 27 మే 2020
International - May 20, 2020 , 15:14:01

రోల్స్ రాయిస్‌లో 9వేల మంది ఉద్యోగుల తొల‌గింపు..

రోల్స్ రాయిస్‌లో 9వేల మంది ఉద్యోగుల తొల‌గింపు..

హైద‌రాబాద్‌: రోల్స్ రాయిస్ విమాన‌యాన ప‌రిశ్ర‌మ సుమారు తొమ్మిది వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న‌ది. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఆ కంపెనీ ఈ చ‌ర్య‌కు దిగ‌నున్న‌ది. డెర్బీకి చెందిన రోల్స్ రాయిస్‌.. విమాన ఇంజిన్లు త‌యారు చేస్తోంది. త‌మ కార్మికుల్లో అయిదో వంతు ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న‌ట్లు ఆ సంస్థ వెల్ల‌డించింది.  ఇది త‌యారీలో సంక్షోభం కాదు అని, ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిందే అని ఆ సంస్థ అధిప‌తి వారెన్ ఈస్ట్ తెలిపారు. బ్రిట‌న్‌లో ఉన్న ఫ్యాక్ట‌రీలో ఎక్కువ శాతం ఉద్యోగుల‌పై వేటు ప‌డ‌నున్న‌ది. రోల్స్ రాయిస్ సంస్థ‌లో సుమారు 52వేల మంది ఉద్యోగులు ఉన్నారు. దేశంపైనా, విమాన‌యాన రంగంపైనా వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా ఉన్న‌ట్లు రోల్స్ రాయిస్ పేర్కొన్న‌ది.


logo