గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Sep 07, 2020 , 19:39:42

ఎగ్జిబిష‌న్‌లో ఆటంకం.. గంట‌పాటు న‌ర‌కం చూశారు!

ఎగ్జిబిష‌న్‌లో ఆటంకం.. గంట‌పాటు న‌ర‌కం చూశారు!

హాలిడేస్ వ‌చ్చాయంటే చాలు చైనీయుల కాళ్లు ఊరుకోవు. క‌రోనా టైంలో కూడా షికార్ల‌కు వెల్లి చిక్కుల్లో ప‌డ్డారు. 20 మంది హాలిడేస్‌కు ఎగ్జిబిష‌న్‌కు వెళ్లారు. అక్క‌డ వారంతా రోల్ కోస్ట‌ర్ ఎక్కారు. స్టార్టింగ్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. త‌ర్వాత స‌రిగ్గా రోల్ కోస్ట‌ర్ ఆకాశంలోకి వెళ్లిన త‌ర్వాత ఆగిపోయింది. సాంకేతిక స‌మ‌స్య కార‌ణంగా అది అక్క‌డే ఆగిపోయింది. ఈ సంఘ‌ట‌న తూర్పు చైనా  జియాంగ్సులోని వుక్సీలో చోటు చేసుకుంది.

రోల్ కోస్ట‌ర్‌ను బాగు చేసేందుకు బృందానికి గంట స‌మ‌యం ప‌ట్టింది. అప్ప‌టి వ‌ర‌కు వారంతా గాల్లోనే ఉన్నారు. పాపం ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డుతారో లేదో అనుకుంటూ వ‌ణికిపోయారు. ఏదేమైనా వీరంద‌రి టైం బాగుంది. రోల్ కోస్టర్‌ను బాగు చేసి వారంద‌రినీ క్షేమంగా కింద‌కి దింపారు. వీరిలో ఎవ‌రికీ ఎలాంటి హాని క‌లుగ‌లేద‌ని అక్క‌డ సిబ్బంది తెలియ‌జేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది. 


logo