ఆదివారం 29 మార్చి 2020
International - Mar 18, 2020 , 10:04:04

ఇరాక్‌లోని అమెరికా స్థావరంపై రాకెట్‌ దాడి

ఇరాక్‌లోని అమెరికా స్థావరంపై రాకెట్‌ దాడి

బాగ్దాద్: ఇరాక్‌లోని అమెరికా, నాటో దళాలు లక్ష్యంగా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల రెండు సార్లు రాకెట్‌ దాడులు జరుగగా.. తాజాగా మరోసారి దాడి జరిగింది. దక్షిణ బాగ్దాద్‌ ప్రాంతంలోని బెస్‌మయ స్థావరంపైకి సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా రాకెట్లు దూసుకొచ్చాయి. అయితే ఈ దాడిలో ఎవరైనా మరణించారా అన్న వివరాలను అధికారులు వెల్లడించలేదు. ఇరాన్‌కు చెందిన జనరల్‌ ఖాసిం సులేమానిని కొద్ది నెలల కిందట అమెరికా హతమార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాక్‌లో ఉన్న అమెరికా స్థావరాలు లక్ష్యంగా రాకెట్‌ దాడులు జరుగుతున్నాయి.logo