శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Jan 27, 2020 , 02:04:36

ఇరాక్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపై దాడి

ఇరాక్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపై దాడి
  • గ్రీన్‌జోన్‌లోకి దూసుకొచ్చిన ఐదు కత్యూశా రాకెట్లు

బాగ్దాద్‌: ఇరాక్‌ రాజధాని బగ్దాద్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం సమీపంలో ఆదివారం వరుస రాకెట్‌ దాడులు కలకలం సృష్టించాయి. టిగ్రిస్‌ నదికి పశ్చిమాన ఉన్న అమెరికా దౌత్యకార్యాలయం సమీపంలో కత్యూశా రకానికి చెందిన ఐదు రాకెట్లు దూసుకొచ్చాయని భద్రతాధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోనే పలు దేశాల దౌత్య కార్యాలయాలు కూడా ఉన్నట్టు వాళ్లు తెలిపారు. అత్యంత భద్రత కలిగిన గ్రీన్‌జోన్‌లో ఐదు రాకెట్‌ దాడులు జరిగాయని, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ఇరాక్‌ భద్రతా దళాలు ప్రకటించాయి. ఈనెల 3న అమెరికా దాడుల్లో మృతిచెందిన ఇరాన్‌ సైనిక ఉన్నతాధికారి ఖాసీం సులేమానీ మరణానంతరం అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం తెలిసిందే.


logo