ఆదివారం 31 మే 2020
International - May 09, 2020 , 19:14:13

సింగపూర్‌ పార్కుల్లో రోబోడాగ్‌లు.. కరోనా కట్టడి కోసమే

సింగపూర్‌ పార్కుల్లో రోబోడాగ్‌లు.. కరోనా కట్టడి కోసమే

 రోబోడాగ్‌... కుక్క‌ల‌కు ఏ ల‌క్ష‌ణాలు అయితే ఉంటాయో అలానే ఈ రోబో ప్ర‌వ‌ర్తిస్తుంది. దీనికి విశ్వాసం కూడా ఎక్కువే. య‌జ‌మానులు చెప్పిన‌దాన్ని త‌ప్ప‌కుండా పాటిస్తుంది. అయితే ఇది ఇంట్లో ఉండ‌దు. పార్క్‌లో ఉంటుంది. ఎందుకంటే.. పార్కులో తిరిగే ప్ర‌జ‌ల‌ను సామాజిక దూరం పాటించ‌మంటూ బాధ్య‌త‌గా గుర్తు చేస్తుంది. పార్కులో ఉండే ప్ర‌జ‌ల‌ను ఓ కంట క‌నిపెడుతూ ఉంటుంది. ఎవ‌రైనా ద‌గ్గ‌ర‌గా ఉన్నారంటే.. వెంట‌నే అక్క‌డ‌కు వెళ్లి "ప్లీజ్ ప్లీజ్ దూరం జరగరా... ఇంకాస్త... ఇంకాస్త" అంటూ పొలైట్‌గా బతిమలాడుతుంది. ఇంత ముద్దుగా మ‌ర‌మ‌నిషి రిక్వెస్ట్ చేస్తే ఎవ‌రు మాత్రం జ‌ర‌గ‌రూ.

ఇంత‌కీ ఇది ఎక్క‌డో తెలుసా?  సింగ‌పూర్‌లో రోజురోజుకి క‌రోనా కేసులు బెడ‌ద పెరుగుతున్న‌ప్ప‌టికీ మ‌ర‌ణాల సంఖ్య త‌క్కువే ఉంటున్నాయి. దీనికి కార‌ణం ప్ర‌భుత్వం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలే. ప్ర‌జ‌ల‌కు బ‌దులుగా రోబోల సాయం తీసుకుంటున్నారు. ఈ రోబోడాగ్‌ను బోస్టన్ డైనమిక్స్ కంపెనీ తయారుచేసింది.  ఫ‌లితాన్ని బ‌ట్టి ఇటువంటి రోబోలను సింగ‌పూర్ అంతా పెట్టాల‌న్న‌ది ప్ర‌భుత్వ ప్లాన్‌గా తెలుస్తున్న‌ది. ఈ రోబో పేరు స్పాట్‌. ఇంగ్లీష్‌లో లేడీ వాయిస్‌తో మాట్లాడుతుంది. రిమోట్ కంట్రోల్‌తో ప‌నిచేస్తుంది. ఎత్తులు ఎక్క‌గ‌ల‌దు. దీనికి కెమెరాను ఫిక్స్ చేశారు. దీనిద్వారా పార్కులో ఎంత మంది ఉన్నారో షూట్ చేసి... తన టెక్నికల్ నిపుణులకు ఫొటోలు పంపిస్తుంది.logo