మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Sep 08, 2020 , 21:51:02

విద్యార్థిని ఆన్‌లైన్‌లో క్లాస్‌ వింటుండగా దొంగలు పడ్డారు.. దొరికిపోయారు..!

విద్యార్థిని ఆన్‌లైన్‌లో క్లాస్‌ వింటుండగా దొంగలు పడ్డారు.. దొరికిపోయారు..!

అంబటో: విద్యార్థులంతా జూమ్‌ యాప్‌లో ఆన్‌లైన్‌ తరగతికి హాజరయ్యారు. ఇంగ్లిష్‌ పాఠం వింటున్నారు. ఇంతలోనే ఒక విద్యార్థిని ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. ఏం జరుగుతుందో తెలియక మిగతా విద్యార్థులంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ దొంగలు వెంటనే ఆమె ల్యాప్‌టాప్‌ను మూసేశారు. దీంతో అక్కడి విద్యార్థులనుంచి ఫోన్‌ నంబర్‌ తీసుకొని టీచర్‌ పోలీసులకు కాల్‌చేయగా, వారు దొంగలను ట్రేస్‌ చేసి పట్టుకున్నారు. 

ఈ సంఘటన ఈ నెల 4 న సెంట్రల్ ఈక్వెడార్‌లోని తుంగూరాహువా ప్రావిన్స్‌లోని అంబటోలో జరిగింది. కారులో వచ్చిన దొంగలు అక్కడినుంచి పారిపోయారని ఈక్వెడార్‌ పోలీసులు తెలిపారు. వారిని ట్రేస్‌ చేసి హువాచి గ్రాండేలో పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రూ. 2.9 లక్షల నగదు, రెండు తుపాకులు, ఒక పంక్చర్ ఆయుధం, రెండు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, ఒక వీడియో గేమ్స్ కన్సోల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అరెస్టయిన నిందితులను లూయిస్ సి, వాలెంటిన్ పి, కార్లోస్ ఎ మరియు డోరియన్ ఆర్‌గా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo