ఆదివారం 23 ఫిబ్రవరి 2020
రిషి కులమేమిటి?

రిషి కులమేమిటి?

Feb 15, 2020 , 02:08:19
PRINT
రిషి కులమేమిటి?
  • బ్రిటన్‌ ఆర్థికమంత్రి కులంపై గూగుల్‌లో భారతీయుల ఆరా

లండన్‌/న్యూఢిల్లీ: బ్రిటన్‌ నూతన ఆర్థిక మంత్రిగా నియమితులైన ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు, భారత సంతతికి చెందిన రాజకీయవేత్త 39 ఏండ్ల రిషి సునక్‌ కులమేమిటో తెలుసుకోవాలని భారతీయులు తెగ ఆరాటపడ్డారట. గత 24 గంటల్లో నమోదైన గూగుల్‌ ట్రెండ్స్‌లో ఈ విషయం వెల్లడైంది. బ్రిటన్‌ ఆర్థిక మంత్రిగా రిషి పేరు బయటకు వచ్చిన వెంటనే అత్యధిక మంది భారతీయులు ఆయన కులం, వంశానికి సంబంధించిన అంశాలను వెతికారని గూగుల్‌ తెలిపింది. కాగా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన రిషీ.. 2015లో బ్రిటన్‌ పార్లమెంట్‌లోకి తొలిసారి అడుగుపెట్టారు. 


logo