శనివారం 27 ఫిబ్రవరి 2021
International - Jan 26, 2021 , 13:14:59

క‌రోనా ఆంక్ష‌లు.. నెద‌ర్లాండ్స్‌లో భారీ హింస‌

క‌రోనా ఆంక్ష‌లు.. నెద‌ర్లాండ్స్‌లో భారీ హింస‌

అమ్‌స్ట‌ర్‌డ్యామ్‌: నెద‌ర్లాండ్స్‌లో వ‌రుస‌గా రెండ‌వ రోజు అల్ల‌ర్లు చోటుచేసుకున్నాయి. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో క‌ర్ఫ్యూ ఆంక్ష‌లు విధించారు. ఆ ఆంక్ష‌ల‌ను వ్య‌తిరేకిస్తూ కొంద‌రు ప‌లు న‌గ‌రాల్లో ఆందోళ‌న చేప‌ట్టారు. అమ్‌స్ట‌ర్‌డ్యామ్‌లో పోలీసులు, నిర‌స‌న‌కారుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. రోట‌ర్‌డ్యామ్‌లో ఆందోళ‌న‌కారులు షాపుల‌పై దాడి చేసి లూటీల‌కు పాల్ప‌డ్డారు. ద హేగ్‌, అమెర్స్‌ఫూర్ట్ ప‌ట్ట‌ణాల్లోనూ నిర‌స‌న‌లు ఉదృతంగా సాగాయి.  ఆందోళ‌న‌కారుల‌ను చెద‌రగొట్టేందుకు రోట‌ర‌డ్యామ్‌లో పోలీసులు నీటి ఫిరంగులు వాడారు. గ‌త 40 ఏళ్ల‌లో ఇలాంటి అల్ల‌ర్లు జ‌ర‌గ‌లేద‌ని పోలీసులు తెలిపారు.  ఆందోళ‌న‌కారుల హింస‌ను ప్ర‌ధాని మార్క్ రుట్‌ ఖండించారు. అమ్‌స్ట‌ర్‌డ్యామ్‌లో 250 మందిని అరెస్టు చేశారు.  క‌రోనా వైర‌స్‌ను అదుపు చేసేందుకు ఆంక్ష‌లు ప్ర‌క‌టించిన‌ తొలి రోజున ఆందోళ‌న‌కారులు షాపుల‌ను లూటీ చేశారు.  కార్ల‌ను ద‌గ్ధం చేశారు.  క‌రోనా వైర‌స్ టెస్టింగ్ స్టేష‌న్‌కు కూడా నిప్పుపెట్టారు.  

VIDEOS

logo