బుధవారం 03 జూన్ 2020
International - Apr 13, 2020 , 14:08:05

రైస్ ఏటీఎంతో బియ్యం పంపిణీ..

రైస్ ఏటీఎంతో బియ్యం పంపిణీ..

హైద‌రాబాద్‌:  క‌రోనా లాక్‌డౌన్‌తో అందిరికీ తిండ క‌ష్టాలు ఏర్ప‌డ్డాయి. వాస్త‌వానికి దాత‌లు బియ్యం, పప్పులు ఇచ్చేందుకు రెఢీగా ఉన్నారు. కానీ సోష‌ల్ డిస్టాన్సింగ్ స‌మ‌స్య‌గా మారింది.  దాతలు ఇచ్చేవాటిని తీసుకునేందుకు జ‌నం ఒక్క‌ద‌గ్గ‌ర కూడితే అది మ‌రింత ప్ర‌మాద‌క‌ర‌మ‌వుతుంది. ఈ నేప‌థ్యంలో వియ‌త్నాంకు చెందిన నుయ‌న్ తువాన్ అన్ అనే వ్య‌క్తి ఓ వెరైటీ ఆలోచ‌న చేశాడు.  రైస్ డిస్పెన్స‌ర్‌ను అత‌ను క‌నుగొన్నాడు. దాన్నే రైస్ ఏటీఎం అని పిలుస్తున్నారు.  హో చి మిన్ సిటీలో దీన్ని ఏర్పాటు చేశారు.  ప్ర‌తి రోజూ 24 గంట‌లు.. ఎవ‌రు వ‌చ్చినా ఏటీఎం మెషిన్ నుంచి బియ్యం తీసుకోవ‌చ్చు.  ఓ యాప్ ద్వారా ఈ సిస్ట‌మ్‌ను కంట్రోల్ చేస్తున్నారు. ఒక్క‌రికి కిలోన్న‌ర బియ్యం ఇస్తున్నారు. ఒక‌వేళ ఒకే వ్య‌క్తి రెండ‌వ సారి వ‌స్తే, అత‌న్ని ప‌సిక‌ట్టే విధంగా యాప్‌ను రూపొందించారు. ఫ్రీ బియ్యాన్ని తీసుకునేందుకు జ‌నం రైస్ ఏటీఎంకు భారీ సంఖ్య‌లో వ‌స్తున్నారు.logo