మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Jul 16, 2020 , 17:08:16

బ్రెజిల్ అధ్య‌క్షుడిని పొడిచిన ప‌క్షి.. పాపం అస‌లే క‌రోనా.. ఇప్పుడిలా!

బ్రెజిల్ అధ్య‌క్షుడిని పొడిచిన ప‌క్షి.. పాపం అస‌లే క‌రోనా.. ఇప్పుడిలా!

బోర్ కొడుతుంద‌ని ప‌క్షుల‌కు ఆహారం అందివ్వ‌బోయి మ‌రో గాయానికి గుర‌య్యారు బ్రెజిల్ అధ్య‌క్షుడు. జైర్ బోల్సోనారోకు ఇటీవ‌ల క‌రోనా సోకింద‌న్న విష‌యం తెలిసిందే. అయితే హాస్పిట‌ల్‌లో ఉండ‌కుండా అధికార భ‌వ‌నాన్నే క్వారెంటైన్‌గా మార్చుకున్నారు. ఎప్పుడూ ప‌నుల‌తో అటూ ఇటూ తిరిగే మ‌నిషి ఒక్క‌సారిగా క్వారెంటైన్‌లో నాలుగు గోడ‌ల మ‌ధ్య ఉండేలేక‌పోయారు. ప‌క్క‌నే ఉన్న రియా ప‌క్షుల‌తో కాల‌క్షేపం చేద్దామ‌నుకున్నారు.

వాటికి ఆహారం తీసుకొని ద‌గ్గ‌ర‌కెళ్లి మరీ‌ తినిపిస్తున్నారు. ఈ క్ర‌మంలో అత‌ను క‌రోనా నిబంధ‌న‌ల‌న్నీ పాటిస్తూనే ఉన్నారు. మూతికి మాస్క్ పెట్టుకొని ధాన్య‌పు గింజ‌ల‌ను రియా ప‌క్షుల‌కు అందిస్తుండ‌గా అవి ఆహారంతో పాటు ఆయ‌న చేతిని కూడా గ‌ట్టిగా ప‌ట్టుకున్నాయి. వాటి ముక్కు చాలా షార్ప్‌గా ఉండ‌డంతో చేతికి గాయ‌మైంది. జైర్ బోల్సోనారోకు చేతిని ప‌ట్టుకొని బాధ‌ప‌డుతున్న ఫోటోలు ఇప్పుటు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే 'క్వారెంటైన్‌లో ఉండ‌డం మాత్రం చాలా క‌ష్టం. ప్ర‌స్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను. రుచులు కూడా తెలుస్తున్నాయి. మ‌రోసారి క‌రోనా ప‌రీక్ష చేయించుకోబోతున్న‌ట్లు' తెలిపారు.తాజావార్తలు


logo