సోమవారం 25 జనవరి 2021
International - Dec 11, 2020 , 15:24:51

త‌ప్పంతా ఇండియాదే: చైనా

త‌ప్పంతా ఇండియాదే: చైనా

బీజింగ్‌: వాస్తవాధీన రేఖ వెంబ‌డి ప్ర‌స్తుతం నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు పూర్తిగా ఇండియానే కార‌ణ‌మ‌ని ఆరోపించింది చైనా. స‌రిహ‌ద్దులో పెద్ద సంఖ్య‌లో బ‌ల‌గాల‌ను మోహ‌రించి.. చైనా ఒప్పందాల‌ను తుంగ‌లో తొక్కింద‌న్న విదేశాంగ మంత్రి జైశంక‌ర్ ఆరోప‌ణ‌ల‌పై చైనా ఇలా స్పందించింది. చైనాతో సంబంధాలు పూర్తిగా క్షీణించాయ‌ని ఆయ‌న చెప్పిన విష‌యం తెలిసిందే. దీనిపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి హువా చున్యింగ్ స్పందించారు.

ప్ర‌స్తుతం వాస్త‌వాధీన రేఖ వెంబ‌డి ఉద్రిక్త‌త‌ల‌కు పూర్తి బాధ్య‌త ఇండియాదే అని ఆమె ఆరోపించారు. ప్ర‌పంచంలోనే రెండు పెద్ద అభివృద్ధి చెందుతున్న దేశాలు పొరుగు దేశాలుగా ఉన్నాయి. రెండు దేశాల మ‌ధ్య మంచి సంబంధాలు ఉండ‌టం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు నెల‌కొన్న ప‌రిస్థితుల‌కు పూర్తి బాధ్య‌త వ‌హించాల్సింది ఇండియానే. చైనా ఒప్పందాల‌కు క‌ట్టుబ‌డి ఉంది. చర్చ‌ల‌తోనే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నిస్తోంది. స‌రిహ‌ద్దు వెంబ‌డి శాంతి, సామ‌రస్యం నెల‌కొనాల‌ని కోరుకుంటున్నా.. మా భూభాగాన్ని కాపాడుకోవ‌డం కూడా ముఖ్య‌మే అని ఆమె అన్నారు.

రెండు దేశాల అభివృద్ది కోసం ఇండియా త‌మ‌తో క‌లిసి న‌డుస్తుంద‌న్న ఆశాభావాన్ని చున్యింగ్ వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం ద్వైపాక్షిక సంబంధాల్లో కొన్ని స‌వాళ్లు ఉన్నా.. ఇండియా విష‌యంలో త‌మ వైఖ‌రి మార‌లేద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. రెండు దేశాల ప్ర‌యోజ‌నాల కోసం మెరుగైన సంబంధాలు నెల‌కొన‌డం అవ‌స‌ర‌మ‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. 


logo