కెంటకీ: అమెరికా ప్రజాప్రతినిధి థామస్ మాసి తన ట్విట్టర్లో పోస్టు చేసిన ఓ ఫోటో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. క్రిస్మస్ సందర్భంగా కెంటకీకి చెందిన రిపబ్లికన్ పార్టీ నేత థామస్ మాసి తన ఫ్యామిలీతో కలిసి ఓ ఫోటో దిగారు. అయితే అందరూ తమ చేతుల్లో గన్ పట్టుకుని మరీ ఆ ఫోటోకు ఫోజులు ఇచ్చారు. ఇక ఆ ఫోటోను పోస్టు చేయడమే కాకుండా, మెర్రీ క్రిస్మస్ అంటూ గ్రీటింగ్స్ కూడా తెలిపారు. మిచిగన్‌లో ఇటీవల ఓ హై స్కూల్లో జరిగిన కాల్పుల ఘటన మరవకముందే రిపబ్లికన్ నేత ఇలా వ్యవహరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తుపాకీ హింసకు గురైన బాధిత కుటుంబాలు థామస్ వైఖరిని ఖండించారు.