మంగళవారం 26 జనవరి 2021
International - Dec 25, 2020 , 21:07:00

సిరియాపై ఇజ్రాయెల్‌ దాడి.. ఆరుగురి మృతి?

సిరియాపై ఇజ్రాయెల్‌ దాడి.. ఆరుగురి మృతి?

బీరుట్: సిరియాపై ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు శుక్రవారం ఉదయం సిరియాపై జరిగిన దాడిలో ఆరుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. అయితే మృతుల సంగతిని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. సిరియాలో ఇరాన్‌ మద్దతుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసినట్లు తెలుస్తున్నది.

ఉగ్రవాదుల ఆయుధ స్థావరాలు, వసతులు, తక్కువ శ్రేణి మిస్సైళ్ల తయారీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశారని సమాచారం. ఇజ్రాయెల్‌ తమ హమా ప్రాంతంలో దాడి చేసిందని.. ఇందుకు సిరియా వైమానిక దళం దీటుగా స్పందించిందని సిరియా మీడియా ప్రకటించింది. ఇజ్రాయెల్‌ వైమానిక దళ విమానాలు లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో తక్కువ ఎత్తు నుంచి దూసుకెళ్లాయని అసోసియేటెడ్‌ ప్రెస్‌ తెలిపింది. 

శుక్రవారం క్రిస్మస్‌ కావటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గత కొంత కాలంగా సిరియాపై ఇజ్రాయెల్ పలుసార్లు గగనతల దాడులకు పాల్పడింది. వీటిలో ఆయుధ రవాణా శ్రేణిపైనే అధికంగా దాడులు చోటుచేసుకోవటం గమనార్హం. ఇక తాజా దాడి జరిగిన మాసైయాఫ్‌ సైతం మిలిటరీ ప్రాంతమే. ఓ మిలిటరీ అకాడమీతో పాటు శాస్త్రీయ పరిశోధనాశాల కూడా ఉన్న ఈ ప్రాంతంపై ఇజ్రాయెల్‌ గతంలో కూడా పలు దాడులు నిర్వహించింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo