శుక్రవారం 05 జూన్ 2020
International - May 07, 2020 , 12:52:19

సింగ‌పూర్ నుంచి రేపు భార‌తీయులను తీసుకురానున్న విమానం

సింగ‌పూర్ నుంచి రేపు భార‌తీయులను తీసుకురానున్న విమానం

సింగ‌పూర్‌: క‌రోనావైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా సింగ‌పూర్‌లో చిక్కుకుపోయిన వారిలో 240 మంది భార‌తీయుల‌తో కూడిన విమానం రేపు ప్రారంభం కానుంది. 20 ప్ర‌త్యేక విమానాలు న‌డుపుతున్న‌ట్లు సింగ‌పూర్ ఎయిర్‌లైన్స్ ప్ర‌క‌టించింది. సింగ‌పూర్‌లో చిక్కుకుపోయిన భార‌తీయుల్లో 3,500 మంది ఇండియాకు రావ‌డానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. శుక్ర‌వారం ఉద‌యం 8:30 గంట‌ల‌కు విమానం సింగ‌పూర్ నుంచి బ‌య‌లుదేరి ఢిల్లీ చేరుకుంటుంద‌ని సింగ‌పూర్ భార‌త హైక‌మిష‌న‌ర్ జావేద్ అష్రాఫ్ తెలిపారు. చెన్నై, త్రిచి, అమృత్‌స‌ర్‌, అహ్మ‌దాబాద్‌, కోల్‌క‌తా ప‌ట్ట‌ణాల‌కు కూడా విమానాలు ఎల్లుండి నుంచి న‌డ‌స్తాయ‌ని వెల్ల‌డించారు. విమానం ఎక్కేముందు ప్ర‌యాణికుల‌కు కోవిడ్‌19 ప‌రీక్ష‌లు చేస్తాం. వ్యాధి ల‌క్ష‌ణాలు ఉన్న‌వారిని ఎవ‌రిని విమానంలోకి అనుమ‌తించం.

ప్ర‌యాణికులు ఇండియాకు చేరుకున్న త‌రువాత కూడా ఆరోగ్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తాం. అనంత‌రం ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో 14 రోజులు ఉండాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నారు. విమాన ప్ర‌యాణం ఖ‌ర్చులు ప్ర‌యాణికులే స్వ‌యంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. సింగ‌పూర్‌లో చిక్కుకుపోయిన ప‌ర్య‌ట‌కులు, వ్యాపార ప్ర‌యాణికులు, కుటుంబ స‌భ్యుల‌ను క‌ల‌వ‌డానికి వీసాపై వ‌చ్చిన వారు, ఉపాధి వీసా ముగిసిన నిపుణులు, వారి కుటుంబ స‌భ్యులు, కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు, తాత్కాలిక ప్రాజెక్టు ప‌నుల‌పై వ‌చ్చిన నిపుణుల‌ను త‌ర‌లించేందుకు మొద‌టి ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని వెల్ల‌డించారు. హిందూ దేవాల‌యంలో పూజ‌కోసం వ‌చ్చి చిక్కుకుపోయిన 50 మంది పూజారులు కూడా అన్నార‌ని పేర్కొన్నారు.


logo